హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మార్వో భవనంలో పగుళ్లు

KRNL: కౌతాళం ఎమ్మార్వో కార్యాలయంలో టైల్స్ కుంగిపోవడంతో పాటు పలుచోట్ల పగుళ్లు ఏర్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం నిర్మాణం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ.. కార్యాలయ మెట్ల మార్గంలోనూ చీలికలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.