KRNL: వర్షాలు కురవాలని కోరుతూ.. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి గండా దీపంతో ఏడు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. భజనలు చేస్తూ మదనంతపురం, బసినేపల్లి, రాంపురం, మొలకలపెంట, శంకరబండ, చిన్నజొన్నగిరి గ్రామాల మీదుగా తిరిగి జొన్నగిరికి చేరుకున్నారు. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని రాత్రంతా భజనలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.
వార్తలు
వర్షాల కోసం పాదయాత్ర


