హైదరాబాద్: 28°C
వార్తలు

నాలుగోవంతు బేళ్లు తిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం అయ్యవారిపాలెం, జువ్విగుంట, పీరాపురం జాళ్ళపాలెం, తంగెళ్ల గ్రామాలకు చెందిన రైతులు 1197 బేళ్లు అమ్మకానికి పెట్టగా.. 869 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి వివిధ కారణాలతో 328 బేళ్లు తిరస్కరించారు. సగటు ధర కేజీ రూ. 250 కాగా, కనిష్ఠ ధర కేజీ రూ. 160గా నమోదయింది. ప్రభుత్వం 200 తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నా కొనుగోలు చేయట్లేదు.