హైదరాబాద్: 28°C
వార్తలు

వారంతా సంఘ విద్రోహ శక్తులు కాదు: రాహుల్

విద్యార్థులంటే మన శత్రువులు కాదని, వారు మన దేశ భవిష్యత్‌, ఆశలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులపై లాఠీఛార్జ్, జలఫిరంగులు వాడటం ఏమిటని మండిపడ్డారు. ఆందోళన చేసేవాళ్లు ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు కాదని తెలిపారు. తప్పు జరిగిందని ఒప్పుకుని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.