హైదరాబాద్: 28°C
వార్తలు

152 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్: రాహుల్

నీట్ పేపర్ లీక్ వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో 152 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ధ్వజమెత్తారు. లీక్‌ల వల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారన్నారు. చదువు, కోచింగ్, ఖర్చుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారని.. లీకేజీ వల్ల విద్యార్థుల కష్టం, డబ్బు వృథా అయిందని పేర్కొన్నారు.