హైదరాబాద్: 28°C
వార్తలు

లారీ ఢీకొని కూలిన హై లెవెల్ బ్రిడ్జి

NTR: విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి వద్ద పోలవరం కుడి ప్రధాన కాలువపై ఉన్న హై లెవెల్ బ్రిడ్జి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. భారీ లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రజల భద్రత దృష్ట్యా వంతెనకు వెంటనే మరమ్మతులు చేపట్టి, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.