హైదరాబాద్: 28°C
వార్తలు

అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

LIC, EPFOలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ నిధుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిధులను ఇతర ఏ అవసరాలకు మళ్లించే ప్రతిపాదన ఏమీ లేదని వెల్లడించింది. 10 ఏళ్లకుపైగా క్లెయిమ్ కాకుండా ఉన్న బీమా నిధులను సీనియర్ సిటిజన్ వెల్పేర్ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. 2026 MAR 31 నాటికి LIC వద్ద రూ.7,318.50 కోట్ల క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయని చెప్పింది.