హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రికార్డుల నిర్వహణను తనిఖీ చేసి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఓటర్లు సిబ్బందికి సహకరించాలని ఓటర్లను ఆయన కోరారు.