హైదరాబాద్: 28°C
వార్తలు

24న విద్యాసంస్థల బంద్

AKP: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ తెలిపారు. ఈ మేరకు బుధవారం పాయకరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.