హైదరాబాద్: 28°C
వార్తలు

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రహదారిపై బండరాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ బండరాళ్లు వాహనాలపై పడడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.