ASR: హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీలో బుధవారం జీవన ఎరువుల వినియోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సూకూరు పంచాయతీలో 'పొలం పిలుస్తోంది' చేపట్టారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవన ఎరువులు వాడడం ద్వారా నేల సారం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేష్, ఏవో సుధాకర్ సూచించారు.
వార్తలు
జీవన ఎరువుల వినియోగంపై శిక్షణ


