హైదరాబాద్: 28°C
వార్తలు

బీహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు

బీహార్‌లోని పట్నా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పట్నాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు.