హైదరాబాద్: 28°C
వార్తలు

మండల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శోభారాణి

ASR: జీకేవీధి మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రింతాడ టేకులవీధి గ్రామానికి చెందిన పాంగి శోభారాణిని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కాకూరు శేఖర్ ఈ నియామకాన్ని ప్రకటించారు. 2016నుంచి పార్టీ కార్యకర్తగా సేవలందిస్తున్నానని, మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.