హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు పార్వతిదేవి అమ్మవారికి పూజలు

WNP: పట్టణంలోని బ్రాహ్మణ వీధి నగరేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23 న పార్వతిదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. వారాహి నవరాత్రుల సందర్భంగా చివరిరోజు అమ్మవారికి అర్చకులు ఉదయం 9 గంటలకు అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం వారాహి అమ్మవారి రూపంలో పార్వతిదేవిని అలంకరించి కుంకుమార్చన, మొదలగు క్రతువులను జరిపిస్తారని, భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.