ELR: ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లి ప్రభుత్వ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్‌లో బుధవారం విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈదర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ జ్ఞాన సందీప్ ఆధ్వర్యంలో 164 మంది బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. సాధారణంగా కనిపించే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు, సూచనలు అందించినట్లు తెలిపారు.
వార్తలు
మైనారిటీ బాలికల హాస్టల్‌లో రక్త పరీక్షలు


