హైదరాబాద్: 28°C
వార్తలు

'కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోండి'

MDK: రంగాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ విస్తరణను వెంటనే ఆపాలని కోరుతూ జనసేన నాయకుడు కమ్మరి శ్రీను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీ కాలుష్యంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా విస్తరణను నిలిపివేసి, పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.