హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ విద్యార్థుల అరెస్టులు ఖండించిన కాంగ్రెస్ నేత

ELR: ఢిల్లీలో నీట్ అక్రమాలపై న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఖండించారు. బుధవారం ఏలూరులో మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.