హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజా బోనాల జాతర

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఘటాన్ని సాంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా ఊరేగించి ప్రతిష్టించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.