హైదరాబాద్: 28°C
వార్తలు

పొంగులేటి కమిషన్ రెడ్డిగా మారారు: MLC

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కమిషన్ రెడ్డిగా మారారని MLC పోచంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. దేవాదుల పంపులు ఆన్ చేయమంటే తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షకు మంత్రులు హాజరుకాలేదన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్‌కు శని పట్టిందని తెలిపారు.