హైదరాబాద్: 28°C
వార్తలు

పశు వైద్యశాల భవనాన్ని నూతనంగా నిర్మించాలని వినతి

అనకాపల్లి గవరపాలెం పశువైద్యశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో వెంటనే కొత్త భవనం నిర్మించాలని కోరుతూ వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సౌజన్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అలాగే పశువులకు మందులు, టీకాలు, దాణా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.