హైదరాబాద్: 28°C
వార్తలు

టమాటా ధరలు పతనం.. ఆందోళనలో రైతులు

KKD: వలసపాకలి గ్రామ పరిసర ప్రాంతాల్లో టమాటా రైతులు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులకు తగిన ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగినా టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని రైతులు తెలిపారు.