హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలను పరిశీలించిన హరీష్ బాబు

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని శివానగర్ మున్సిపల్ హైస్కూల్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు సందర్శించారు. పాఠశాలలో విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు.