కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసకిరణ్ ఆధ్వర్యంలో విష్వక్సేన పూజ, పుణ్యహవచనం జరిగాయి. 108 కలశాలతో పూజలు చేసి, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వార్తలు
అంతర్వేదిలో ఘనంగా శత కలశాభిషేకం


