హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎస్. సవితను గోరంట్ల సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా గోరంట్లలోని తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్లు, కదిరి నుండి రాత్రి 7:30 తర్వాత ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ తదితర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.