హైదరాబాద్: 28°C
వార్తలు

'100% పూర్తయిన ఓటరు జాబితా సవరణ'

KMR: సదాశివనగర్ మండలం వజ్జపల్లి తండాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేటికి 100% పూర్తయినట్లు సర్పంచ్ సంధ్య తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే మూలస్తంభమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు బాధ్యతాయుతంగా సహకరించాలని పేర్కొన్నారు.