హైదరాబాద్: 28°C
వార్తలు

'డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'

GDWL: కేటిదొడ్డి మండలం కుచిచెర్లలో కురిసిన వర్షాలకు వీధుల్లో నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, దోమల సమస్య పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపిస్తూ, వెంటనే నీటిని తొలగించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.