హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా పెరిగిన బియ్యం ధరలు

TG: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ కాగా, సన్నబియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండున్నర నెలల్లో కిలో సన్న బియ్యం ధర రూ.10-12 వరకు పెరిగింది. సోనా మసూరీ, BPT, IR-64 రకం క్వింటాకు రూ.1,000-రూ.1,500 వరకు పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. ఎల్‌నినో కారణంగా వరిసాగు తగ్గుతుందన్న అంచనాలతో హోల్ సేల్ వ్యాపారులు బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.