హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: 10 మంది మృతి

గుజరాత్‌లోని రామోల్ ప్రాంతంలో అక్రమ బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందినట్లు సమాచారం. లైసెన్స్ లేదని మార్చి 31న అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఫ్యాక్టరీని సీజ్ చేసినా.. అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద ఘటన, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.