హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

GNTR: పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర.. సీఎం చంద్రబాబును కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలను వివరించి, పనులకు నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియ, స్థానిక ఎన్నికలపై ఇద్దరూ చర్చించారు. పార్టీ పటిష్టత, తాజా రాజకీయ పరిణామాలపైనా వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది.