MLG: వర్షాకాలంలో జలపాతాల వద్ద ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని అటవీశాఖ మరోసారి హెచ్చరించింది. ములుగు జిల్లా దూలాపురం రేంజ్ పరిధిలోని గుండం జలపాతం వద్ద నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన వరంగల్‌కు చెందిన నలుగురిపై ట్రెస్పాస్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు వారికి మొత్తం రూ.8 వేల జరిమానా విధించారు.
వార్తలు
నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన నలుగురిపై కేసు


