TG: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుంచి ఓ దుండగుడు TGSRTC బస్సును అపహరించాడు. బస్సును విచక్షణారహితంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొడుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమ వాహనాల్లో సినిమా రేంజ్‌లో బస్సును సుదీర్ఘంగా ఛేజ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని, బస్సును స్వాధీనం చేసుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
బస్సు ఎత్తుకెళ్లాడు.. మూవీ రేంజ్‌లో ఛేజ్


