హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు లైన్‌లో వేచిఉన్నారు. క్యూలైన్‌లలో భక్తులకు టీటీడీ అన్ని వసతులు కల్పించింది. నిన్న స్వామివారిని 82,105 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,484 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.