హైదరాబాద్: 28°C
వార్తలు

21కి చేరిన అసోం వరదల్లో మృతుల సంఖ్య

అసోంలో వరద ఉద్దృతి తీవ్రంగా ఉంది. ఈ వరదల్లో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. వరద ప్రభావం 5.4 లక్షల మందిపై ఉన్నట్లు సమాచారం. భారత సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకుపోయిన 200 మందికి పైగా పౌరులను రక్షించింది. రెస్క్యూ బోట్లు, వైద్య బృందాలు ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరులను తరలించి, బాధితులకు అత్యవసర వైద్యం అందిస్తున్నాయి.