హైదరాబాద్: 28°C
వార్తలు

మూడో రోజు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ సమావేశాలు ఇవాళ మూడో రోజుకు చేరాయి. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, చర్చకు అనుమతించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తుపై సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.