హైదరాబాద్: 28°C
వార్తలు

పర్చూరులో నాలుగు వెటర్నరీ కేంద్రాలకు సొంత భవనాలు

BPT: పర్చూరు నియోజకవర్గంలోని 4 పశు వైద్య కేంద్రాలకు రూ. 1.25 కోట్లతో నూతన భవనాలు మంజూరయ్యాయి. పర్చూరు వెటర్నరీ ఆసుపత్రికి రూ. 35 లక్షలు, కోనంకి, పునూరు, కారంచేడు డిస్పెన్సరీలకు రూ. 30 లక్షల చొప్పున కేటాయించారు. ఈ భవనాలతో పాడి రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.