హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధం: కేంద్రమంత్రి

నీట్ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను వాడుకుంటూ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. ప్రధాని నివాసం వద్ద నిరసన తెలపడం భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనంటూ మండిపడ్డారు.