హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాదర్బార్‌లో 86 అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రజల నుంచి 86 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజలు, నాయకులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.