హైదరాబాద్: 28°C
వార్తలు

హాస్టళ్లు, కేజీబీవీలపై కలెక్టర్ సమీక్ష

మార్కాపురం కలెక్టర్ విజయ సునీత ఇవాళ ఉదయం 10 గంటలకు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీల నిర్వహణ తీరుతెన్నులపై చర్చించనున్నారు. అలాగే విద్యార్థుల సంక్షేమం, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించనున్నారు.