హైదరాబాద్: 28°C
వార్తలు

ఒక్క విద్యార్థి చదువు కోసం రూ. 12 లక్షల ఖర్చు

కోనసీమ: అమలాపురం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఏటా రూ.12 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఒక్క పిల్లాడికి పాఠాలు చెప్పడానికి ఒక టీచర్, మధ్యాహ్న భోజనం, వండడానికి ఒక వంట మనిషి, పాఠశాల అవసరాల కోసం ఒక ఆయా ఉన్నారు. ఈ బడి అద్దె భవనంలో నడుస్తుంది.