హైదరాబాద్: 28°C
వార్తలు

రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో రోబోటిక్స్ శిక్షణ

KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో విద్యార్థులకు రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, సర్క్యూట్ బిల్డింగ్, రోబోటిక్ మోడళ్ల రూపకల్పనపై ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ శిక్షణతో విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారని స్కూల్ డైరెక్టర్ కర్నల్ రాజాదత్త తెలిపారు