హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు

TG: న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరిగాయి. సాంప్రదాయ బోనాలు, పోతురాజుల విన్యాసాలతో ప్రాంగణం కోలాహలంగా మారింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.