హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఫైర్

TG: అధికారం పోవడంతో KTR పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన జాతి కాంగ్రెస్ అయితే, ద్రోహం చేసిన జాతి BRS అని విమర్శించారు. ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.