హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఖాతాల్లోకి డబ్బులు

AP: ఈరోజు నుంచి 4 రోజుల్లో తరగతుల వారీగా 'తల్లికి వందనం' నిధులు జమ కానున్నాయి. ఈ పథకంతో 67.47 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా.. అందులో రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో, రూ.2 వేలు పాఠశాల నిర్వహణకు వెళ్తాయి. ఈసారి కొత్తగా 17 వేల మంది అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది.