హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కుటుంబంలో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ.. మేజర్ అయిన అవివాహిత కుమార్తె, తన పైచదువుల ఖర్చుల కోసం తల్లిదండ్రులను ఆర్థిక సాయం కోరవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళూరులోని ఫాదర్ ముల్లర్స్ కాలేజీలో ఎం.డీ డెర్మటాలజీ ప్రవేశం పొందిన 23 ఏళ్ల కుమార్తె విద్యా కోసం రూ.16 లక్షలు తండ్రి ఇవ్వాలని ఆదేశించింది.