హైదరాబాద్: 28°C
వార్తలు

CJP అధికార ప్రతినిధిపై వేటు

ఢిల్లీలో సీజేపీ నిరసనలు ఉద్ధృతంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి విజేతా దహియా ఒక బర్గర్ అవుట్‌లెట్‌లో కనిపించినట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వైపు నిరసనలో పాల్గొన్న విద్యార్థులు లాఠీ దెబ్బలు తింటుంటే దహియా బర్గర్ తినడంపై విమర్శలు వచ్చాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం అతడిని పదవి నుంచి శాశ్వతంగా తొలగించింది.