హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో ఎఫెక్ట్.. అన్నదాత ఆందోళన

PLD: ఎల్‌నినో ప్రభావంతో పల్నాడు జిల్లాలో ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతింది. వర్షాభావం, మండుతున్న ఎండలు, ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగా ఇప్పటివరకు కేవలం 17.77 శాతం మాత్రమే సాగు నమోదైంది. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.