KRNL: ఆదోని ట్రాఫిక్ కానిస్టేబుల్ షేక్ అలీ ఆజాద్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రతిరోజూ కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు వెళ్తున్న దాదాపు 60 మంది పేద విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిన ఆయన, సొంత ఖర్చులతో కొత్త పాదరక్షలను కొనుగోలు చేసి అందించారు. చిన్నారుల పట్ల ఆయన చూపిన ఈ ఉదారతపై స్థానికులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు
VIDEO: కానిస్టేబుల్ అలీ ఆజాద్ సేవాభావం


