W.G: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ జిల్లా కార్యదర్శి డి. కల్యాణి మంగళవారం భీమవరంలో ఐసీడీఎస్ ఏపీడీ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 31న కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
వేతనాల పెంపునకు అంగన్వాడీల డిమాండ్


