హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి పైపుల చోరీ

NTR: పెనుగంచిప్రోలు మండలంలోని మోడల్ కాలనీలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులు చోరీకి గురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో పేద ప్రజలు తాగునీటి సౌకర్యం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.