హైదరాబాద్: 28°C
వార్తలు

మేదరమెట్ల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు

BPT: అద్దంకి నుంచి ఒంగోలు వెళ్లే వాహనదారులు మేదరమెట్ల ఫ్లైఓవర్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫ్లైఓవర్ కింద రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. రోడ్లకు మరమ్మతులు చేసి నూతన లేయర్ వేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను స్థానికులు కోరుతున్నారు.